Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి

Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి
X

జులై 26, 2025న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీలు మరణించారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ప్రయాణిస్తున్న స్కార్పియో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్న డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావుగా గుర్తించారు. కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ ప్రసాద్ మరియు డ్రైవర్ నర్సింగ్‌రావు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. హోంమంత్రి అనితతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు డీఎస్పీల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story