YSRCP : ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

YSRCP : ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా

వైసీపీ ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి(ఎమ్మెల్యే కోటా), కర్రి పద్మశ్రీ(గవర్నర్ కోటా) తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పార్టీ పదవులకు కూడా రిజైన్ చేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ ఎంపీలు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన విషయం తెలిసిందే. వీరు కూడా టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. . 32 సంవత్సరాల పాటు టీడీపీలో కొనసాగిన మస్తాన్‌రావు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి రాజీనామా చేశారు. కాగా ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, మరికొందరు మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్ల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరారు. మరోవైపు వైసీపీని వీడనున్నారనే ప్రచారాన్ని రాజ్యసభ ఎంపీలు కృష్ణయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ ఖండించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అధికారం కోసం పార్టీ మారబోమని స్పష్టం చేశారు. బీసీల కోసం పోరాడేందుకు తనను రాజ్యసభకు పంపిన జగన్‌ను వదిలి వెళ్లేది లేదని కృష్ణయ్య తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీ లోనే ఉంటానని చంద్రబోస్ చెప్పారు. తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆళ్ల మండిపడ్డారు.

Tags

Next Story