Undavalli Arun Kumar: టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్నా- ఉండవల్లి

Vundavalli Aruna Kumar: ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని తాను భావిస్తున్నానన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. కానీ జగన్ కొనసాగాలని బీజేపీ భావిస్తే పొత్తులు ఉండకపోవచ్చన్నారు. జగన్ బీజేపీతో సఖ్యతగా ఉన్నన్ని రోజులు కేసులు ఏమీ చేయలేవన్నారు. జగన్‌పై ఉన్న ఈడీ కేసులకు ఫైన్ సరిపోతుందని, శిక్ష పడినా 2 ఏళ్లకు మించదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
పోలవరం నిర్మాణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం లేదని.. కనీసం చిన్న పాటి రిజర్వాయరైనా పూర్తి చేస్తే బాగుంటుందని అన్నారు. నిర్వాసితులకు భారీ పరిహారం ఇవ్వాల్సి వస్తుందని కారణంతో డ్యామ్ ఎత్తు తగ్గిస్తారా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించే ధైర్యం ఏపీలో జగన్ ప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com