Vangalapudi Anitha: మహిళలను కాపాడలేని సీఎం ఆ పదవిలో ఉన్నా లేకున్నా ఒకటే: అనిత
Vangalapudi Anitha: రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
BY Divya Reddy23 May 2022 1:45 PM GMT

X
Divya Reddy23 May 2022 1:45 PM GMT
Vangalapudi Anitha: రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నా..సీఎం జగన్ ఏమాత్రం స్పందించటం లేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీసాలు మెలేసి, సినిమా డైలాగులతో జబ్బులు చరిచినవారంతా.. ఆడవాళ్లపై దౌర్జన్యాలకు దిగుతుంటే.. రాష్ట్రంలో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు నెల్లూరులోని పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ మహిళ నాయకురాలు, ఆమె భర్తపై వైసీపీ నాయకులు దాడికి తెగబడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వంగలపూడి అనిత.
Next Story