AP : దువ్వాడను సస్పెండ్ చేయండి జగనన్న: వాణి

AP : దువ్వాడను సస్పెండ్ చేయండి జగనన్న: వాణి
X

టెక్కలిలోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటి ముందు భార్య వాణి, కూతురు హైంధవి బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ‘దువ్వాడను వెంటనే ఎమ్మెల్సీగా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగనన్నను కోరుతున్నాను. వైసీపీ దీనిపై కచ్చితంగా ఆలోచించాలి. మాకు న్యాయం చేయాలి’ అని వాణి డిమాండ్ చేశారు. తన గురించి దువ్వాడ శ్రీనివాస్‌ నీచంగా మాట్లాడటం సబబేనా అని వాణి ప్రశ్నించారు. ఎలాంటి వాళ్లను జగన్‌ పార్టీలో ఎలా ఉంచుకుంటారని ప్రశ్నించారు. దువ్వాడను వెంటనే ఎమ్మెల్సీగా సస్పెండ్‌ చేయాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని జగనన్న కోరుతున్నా అని అన్నారు. దీనిపై వైసీపీ కచ్చితంగా ఆలోచించాలని.. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story