AP : వర్రాకు వైసీపీ నుంచే ప్రాణహానీ.. బీటెక్ రవి హాట్ కామెంట్

AP : వర్రాకు వైసీపీ నుంచే ప్రాణహానీ.. బీటెక్ రవి హాట్ కామెంట్
X

వైఎస్ఆర్ సీపీ సోషల్‌ మీడియా నేత వర్రా రవీంద్రా రెడ్డికి వైసీపీ నుంచే ప్రాణ హాని ఉందన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. వర్రా రవీంద్ర విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతుందన్నారు. వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో లీకులు ఇచ్చి అరెస్టు చేయించారన్నారు. అతనికి ప్రాణ హాని కలిగించి, ఆ నెపాన్ని ఆంధ్రా పోలీసుల మీద, టీడీపీ కూటమి మీద తోయాలని అనుకుంటున్నారని బీటెక్ రవి చెప్పారు. మరోవైపు.. వర్రా రవీంద్రారెడ్డి భార్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షర్మిల చేసిన ఆరోపణలను అబద్ధమని ఆమె వీడియోలో చెప్పారు.

Tags

Next Story