YS Vijayamma : వైఎస్ కుటుంబానికి దిష్టి తగిలింది ఏపీకి మంచిది కాదంటూ విజయమ్మ లేఖ

అన్నా చెల్లెలు జగన్, షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల రచ్చ పై వైఎస్ విజయమ్మ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారాన్ని పెద్దని చేయొద్దంటూ కోరారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. జరగకూడనివన్నీ తన కళ్ల ముందే జరిగిపోతున్నాయన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. ఇది పిల్లలిద్దరికే కాదు.. రాష్ట్రానికి కూడా మంచిది కాదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొన్ని ఆస్తులు బిడ్డ పేరు మీదు, మరికొన్ని ఆస్తులు కొడుకు జగన్ పేరిట పెట్టారనీ.. అంతే కానీ.. ఆస్తుల పంపకం జరగలేదన్నారు. ఇది తెలిసి వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి అబద్ధాలు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తీస్తున్నది వైఎస్‌ఆర్ కుటుంబం పరువు అని స్పృహ లేకుండా అవాస్తవాలు మాట్లాడారంటూ మండిపడ్డారు. షర్మిల ఆస్తుల లిస్టు బయటపెట్టిన వారు.. జగన్ పేరు మీద ఉన్న ఆస్తుల చిట్టా బయటపెట్టాల్సింది అన్నారు. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు కలిసి జగన్, షర్మిల కలిసే ఉన్నారన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, 200 కోట్లు షర్మిల భాగానికి ఇచ్చారని తెలిపారు. ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆస్తుల పరంగా విడిపోదామని 2019లో జగన్ ప్రపోజల్ పెట్టారని అలా విడిపోయారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com