AP Government : విజయవాడలో మెట్రో.. టెండర్లకు ఆహ్వానం పలికిన ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి పథం లో దూసుకెళ్తుంది. అమరావతి తో పాటు రాష్ట్రం లోని అనేక నగరాలను హై క్లాస్ సిటీస్ గా రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థ ను ముందుగా మెరుగు పరుస్తోంది. ఏపీ లో ప్రధాన నగరాలు అయిన విజయవాడ, విశాఖపట్నం లలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు మెట్రో రైలు వ్యవస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే విశాఖ మెట్రోకు టెండర్లు పిలవగా... తాజాగా, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానించారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈపీసీ విధానంలో టెండర్లకు ఆహ్వానం పలికింది.
ఇందులో భాగంగా విజయవాడ మెట్రో తొలి దశలో రెండు కారిడార్లు నిర్మించనున్నారు. కారిడార్-1లో భాగంగా నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం బస్టాండ్ వరకు... కారిడార్-2లో బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు నిర్మాణం చేపడతారు. మొత్తం 38.4 కిలోమీటర్ల మేర జరగనున్న మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. ఇందులో మొత్తం 32 మెట్రో స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఉండనుంది. కాగా ఈ నిర్మాణాలు పూర్తి ఐతే ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com