AP : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న పోలింగ్, సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. GVMC కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, ZPTC, MPTCలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, వైసీపీకి 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించారు. కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలతో చర్చించి దీనిపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మన్సిపల్ కార్పరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అంటే ఉమ్మడి విశాఖ పరిధిలో మొత్తం 841 ఓట్లర్లు ఉన్నారు. వైసీపీకి బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి. మరో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com