TDP: టీడీపీ లో చేరిన 40 మంది వాలంటీర్లు

TDP: టీడీపీ లో చేరిన 40 మంది వాలంటీర్లు
టీడీపీ నేత వేమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిక

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు నుంచి 40 మంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తుందని, రూ.10 వేలు జీతం వస్తుందన్న భరోసాతోనే వారంతా పార్టీలో చేరారని పేర్కొన్నారు. తెదేపాపై నమ్మకంతో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే.. మహిళా వాలంటీర్లకు గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక మహిళను ఓడించలేక వైకాపా నేతలు అనసవర విమర్శలకు దిగుతున్నారని, ఓట్లు అడిగే ముందు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఏపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల పేరు మారుమోగుతోంది. ఎన్నికల ముందు నుంచి కూడా రాజకీయం వాలంటీర్ల చుట్టూనే తిరిగింది. వాలంటీర్లే మన సైన్యం అని సీఎం జగన్ సహా వైసీపీ నేతలంతా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో, ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పలువురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్నారు.

తాజాగా సీన్ రివర్స్ అయింది. భారీ సంఖ్యలో వాలంటీర్లు టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడువలూరు మండలంలో 40 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వీరంతా టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబుపై నమ్మకంతోనే టీడీపీలో చేరామని వారు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story