Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుని నిరసిస్తూ.. అసెంబ్లీలో మాటల యుద్ధం..

Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుని నిరసిస్తూ.. అసెంబ్లీలో మాటల యుద్ధం..
Andhra Pradesh: ఏపీ శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు అధికార, ప్రతిపక్ష సభ్యులు.

Andhra Pradesh: ఏపీ శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు అధికార,ప్రతిపక్ష సభ్యులు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదంటూ విమర్శలు చేశారు అధికార పక్షం ఎమ్మెల్సీలు. అయితే వైసీపీ సభ్యులకు కౌంటర్ ఇస్తూ నినాదాలిచ్చారు టీడీపీ సభ్యులు.

బాబాయికి గొడ్డలిపోటు,చెల్లికి వెన్నుపోటు, తల్లిని గేంటేసిన అబ్బాయ్ అంటూ నినాదాలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీలు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ సభ్యుల గందరగోళం నేపథ్యంలో మండలి వాయిదా పడింది

సమావేశాలు మొదలైనప్పటి నుంచి గందరగోళం నెలకొంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు మండలి చైర్మన్.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఛైర్మెన్ పోడియం చుట్టూ ముట్టారు టీడీపీ ఎమ్మెల్సీలు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లు ఉపసంహరించాలంటూ నిరసన చేపట్టారు. ఒకవైపు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టీడీపీ సభ్యుల నిరసన కొనసాగింది. ఇక తిరిగి మండలిలో సమావేశాలు మొదలైనప్పటి నుంచి గందరగోళం నెలకొంది.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు మండలి చైర్మన్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఛైర్మెన్ పోడియం చుట్టూ ముట్టిన టీడీపీ ఎమ్మెల్సీలు. మండలిలో టీడీపీ సభ్యుల డిమాండ్‌కు పీడీఎఫ్‌, ఎస్టీయూ, బీజేపీ సభ్యులు మద్ధతుగా నిలిచారు.

Tags

Read MoreRead Less
Next Story