YCP : కుల సంఘాల ముసుగులో వైసీపీ కుట్రలు

వైసీపీ పార్టీని ఇప్పుడు ఏపీలో ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు. కూటమి చేస్తున్న అభివృద్ధికి, వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసానికి తేడా చూసిన ప్రజలు.. వైసీపీ నేతలను ఛీ కొడుతున్నారు. అందుకే వైసీపీ బ్యాచ్ కూడా డెవలప్ మెంట్ మీద మాట్లాడట్లేదు. ఛాన్స్ దొరికితే ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అలజడి సృష్‌టించేందుకు కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగా కందుకూరు ఘటనలో మళ్లీ కులం కుంపటి ఎత్తుకుంది. ఒకవేళ చనిపోయిన లక్ష్మీనాయుడు, చంపిన హరిశ్చంద్ర ప్రసాద్ ఇద్దరూ జనసేన, టీడీపీ పార్టీలు అయితే వైసీపీ ప్రచారం మామూలుగా ఉండేది కాదు. కానీ చనిపోయింది, చంపింది ఇద్దరూ టీడీపీ నాయకులే కావడంతో వైసీపీకి పార్టీల పేరు లాగేందుకు ఛాన్స్ దొరకలేదు.
అందుకే అలవాటైన కుల రాజకీయాలను తెరమీదకు తెచ్చింది. ఇంకేముంది కాపు కుల యువకుడిని కమ్మ కులస్తుడు చంపేశాడని.. కమ్మ కులానికి చెందిన హరిశ్చంద్రప్రసాద్ ను టీడీపీ కాపాడుతోందంటూ ప్రచారం మొదలు పెట్టింది. అయితే వైసీపీ పార్టీ మాత్రమే ఈ ప్రచారం చేస్తే ప్రజలు పెద్దగా నమ్మరు కదా.. అందుకే కుల సంఘాలను తెరమీదకు తేవాలని ప్రయత్నాలు చేసింది. కానీ చాలా కాపు సంఘాలు ఇది కులాల మధ్య జరిగిన గొడవ కాదని.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ అని తేల్చి చెప్పేశాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం ఊరుకోవట్లేదు. ఏకంగా కుల సంఘాల నాయకుల ముసుగులో వాళ్లే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కుల సంఘాలలో ఉండే వాళ్లే ఎక్కువగా రాజకీయాల్లో ఉంటారని మనకు తెలిసిందే కదా.
అందుకే కాపు కుల సంఘాలలో ఉండే కొందరు వైసీపీ నేతలు, ఆ వైసీపీకి సానుకూలంగా ఉండే ఇంకొంత మంది కాపు సంఘాల లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టి.. కమ్మ, కాపు కులాల మధ్య చిచ్చు రాజేసేలా ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ జరిగింది ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంల గొడవ జరిగి చివరకు హత్యకు దారి తీసింది. హరిశ్చంద్ర పరసాద్, తన భర్త లక్ష్మీ నాయుడు మంచి ఫ్రెండ్స్ అని.. డబ్బుల విషయంలోనే గొడవ అయిందని సుజాతనే స్వయంగా చెప్పింది. పైగా సీఎం చంద్రబాబు పదెకరాలు, పది లక్షల నగదు పరిహారంగా అందజేశారు. నిందితుడిని శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టను ఏర్పాటు చేశారు. ఇంకా ఇందులో కులం సానుభూతి ఎక్కడుంది. సొంత పార్టీ నేతలనే తప్పు చేస్తే సస్పెండ్ చేస్తున్న చంద్రబాబు.. నిందితులను వదిలిపెడుతారా.. ఈ విషయం ప్రజలు కూడా గమనిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం ఇలాంటి కుట్రలను ఆపట్లేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com