YCP: జగన్ ప్రాపకం కోసం బరితెగించారా..?

పవర్ పోయి 15 నెలల అవుతుంది. ఫ్యాన్ స్పీడ్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇదే టైమ్‌లో అక్కడక్కడ లీడర్ల మనోగతం మాత్రం బయటపడుతోంది. సీనియర్లు.. ఏదున్నా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే పలువురు నేతలు..మనసులో మాటను, ఆవేదనను బయటపెడుతున్నారు. అధినేతకు ఆప్తులు..పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట నడిచిన వాళ్లు..జగన్ తీరు, పార్టీ పనితీరు మారాల్సిందే అంటున్నారు. లేటెస్ట్గా మాజీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అయితే సుతిమెత్తంగా సున్నితంగానే అధినేతకు చురకలు అంటించారు. లీడర్ల స్వరం అందుకే మారుతుందా? నేతల స్ట్రెయిట్ టాక్..అధినేతకు సందేశం పంపుతోందా? ఘోర ఓటమి సిన్సియర్, సీనియర్ ఫ్యాన్ పార్టీ లీడర్లను డైలమాలో పడేసింది. పక్క పార్టీల్లోకి వెళ్లలేరు. అలా అని అధినేత వెంట దూకుడుగా నడవలేరు. ఓవైపు కూటమి సర్కార్ తీరు..మరోవైపు తమ హయాంలో జరిగిన మిస్టేక్స్ అన్నీ బేరీజు వేసుకుంటున్నారు.
సీనియర్ల అభిప్రాయాలు
ఈ క్రమంలోనే పలువురు వైసీపీ సీనియర్లు తమ అభిప్రాయాలు ఉన్నది ఉన్నట్లుగానే చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీమంత్రి పేర్నినాని..ఇలా కొందరు నేతలు..తమ అధినేత చేసిన మిస్టేక్స్, పార్టీ నేతలు మాట్లాడిన మాటలు తమకు ఎంత డ్యామేజ్ చేశాయో ఇప్పటికే తమ వాయిస్ వినిపించారు. వైసీపీ పార్టీ వ్యవహారాలపై పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ పనితీరు, గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై రెస్పాండ్ అయిన రాజమోహన్‌రెడ్డి..మాజీ సీఎంకు వాస్తవాలు చెప్పకుండా, ఆయన చుట్టూ చేరిన వారంతా భజన చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీగా పనిచేసిన రాజమోహన్‌రెడ్డి వయసు రిత్యా యాక్టీవ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయాలను మేకపాటి కుటుంబమే పర్యవేక్షిస్తోంది. దీంతో మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్‌కు గ్రౌండ్ లెవల్లో ఉన్న పరిస్థితులపై సరైన నిర్దేశం చేయడం లేదన్న పెద్దాయన..చుట్టూ ఉన్న వారి భజనకు ఆకర్షితుడై అధినేత ప్రజలకు దూరమయ్యారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న మేకపాటి..ఓటమికి కారణాలను ఎనాలిసిస్ చేసి, పార్టీ చేసిన తప్పులను రిపీట్ కాకుండా చూసుకుంటే బెటర్ అన్నారు. జగన్ అధికారంలో ఉండగా, అప్పటి ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం సరికాదన్నారు. మాజీ సీఎం జగన్ చుట్టూ మేధావులు, మంచి సలహాలు ఇచ్చే సీనియర్లు ఉండాలన్నది మేకపాటి ఆకాంక్ష.
భజన ఎంత పనిచేసింది..
మంత్రులైన వాళ్లు తమ పదవుల్ని కాపాడుకోడానికి, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లు మంత్రులు కావడానికి ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడి ప్రత్యర్ధులను టార్గెట్ చేసి…లేని పోని సమస్యలకు కారణం అయ్యారనేది సీనియర్ల అభిప్రాయం. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 3లక్షల కోట్ల రూపాయల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు జగన్. మరో రెండు, రెండున్నర లక్షల కోట్లతో ఇళ్లు, ఇళ్లస్థలాలు వంటి పథకాలు అమలు చేశారు. ఇవన్నీ చూసిన వైసీపీ నేతలు జగన్ కు తిరుగేలేదని వై నాట్ 175 అనే వరకు వెళ్లారు. అంటే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లనే జగనే గెలుస్తారనే ప్రచారం చేసేశారు. కట్ చేస్తే… 11 సీట్లకే పరిమితం కావాల్సిన ఘోర ఓటమిని మూటకట్టుకుంది వైసీపీ. సంక్షేమ పథకాల మీదే ఎన్నికలు జరిగి ఉంటే వాటి చుట్టే జనంలో చర్చ జరిగేది. అదే ఎన్నికల అజెండా అయ్యి ఉండేది. కానీ వ్యవహారం కాస్తా శాపనార్ధాలు, తొడగొట్టుడు… నోటికొచ్చిన తిట్లు, స్థాయిలేని వ్యాఖ్యలతో రోజూ పతాక శీర్షికల్లో ఉండేలా జగన్ భక్త మేథావులు చేశారని మేకపాటి వంటి వారు వాపోతున్నారట. విమర్శలు చెయ్యోచ్చు కానీ…. జగన్ మెచ్చుకుంటాడని ఏదంటే అది మాట్లాడి ఆయనకే నష్టం చేశారని…అలాంటి బ్యాచ్ ను ఇకనైనా దూరం పెడితే మంచిదంటున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

