Onions: ఉల్లి పేరుతో వైసిపి డ్రామాలు..

Onions:  ఉల్లి పేరుతో వైసిపి డ్రామాలు..
X

ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. సూపర్ సిక్స్ లో భాగంగా హామీ ఇచ్చినట్టే అన్నదాత సుఖీభవ పేరుతో డబ్బులు అకౌంట్లలో జమ చేసింది. ఇటు పెట్టుబడి సాయంతో పాటు అటు వర్షాలు కూడా బాగా కురిసి చెరువులు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. పంటలు కూడా బాగా పండుతున్నాయి. ఇలా ఏపీలో రైతులకు అన్ని రకాలుగా సంతోషం ఉండడంతో జగన్ అతని అనుచరులు ఓర్చుకోలేకపోతున్నారు. ఎలాగైనా రైతులను రెచ్చగొట్టి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణలో యూరియా కొరత వేధించింది. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి లేదు.

అయినా సరే జగన్ తన పార్టీ కార్యకర్తలతో ఓ ఫేక్ డ్రామా ఆడించి నిరసన తెలిపారు. చివరకు రైతులకు అలాంటి ఇబ్బంది లేదని వాళ్ళే చెప్పడంతో నవ్వుల పాలయ్యారు. రైతులను బద్నాం చేయడానికి వైసిపి ప్రయత్నిస్తుండడంతో రైతులే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి సమస్యలు లేకపోయినా కావాలనే తమను లాగుతున్నారంటూ మండిపడుతున్నారు. ఆ డ్రామా వర్కౌట్ కాకపోవడంతో వైసిపి మరో ప్లాన్ వేసింది. ఉల్లి రైతులకు కష్టాలు అంటూ.. కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కొత్త డ్రామాకు తెర తీసింది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం ఉల్లికి క్వింటాలుకు 1200 మద్దతు ధర ప్రకటించింది. అలాగే హెక్టార్ కు 50 వేల నష్టపరిహారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెల్లింపులు కూడా వెంటవెంటనే కూటమి ప్రభుత్వం చేస్తోంది. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ముందుగా పరిహారం చెల్లించాలని చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. అందుకు తగ్గట్టే చెల్లింపులు జరగడంతో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ వైసీపీ మాత్రం సంతోషంగా లేదు. అందుకే కోడుమూరు నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలతో డ్రామా ఆడించారు. కానీ వాళ్లు పురుగుల మందు తాగలేదని ఫుల్లుగా మద్యం తాగి వచ్చారని డాక్టర్లే స్వయంగా తేల్చారు. దీంతో అక్కడ కూడా పరువు పోయింది.

ఇలా ప్రతిసారి అడ్డంగా దొరికి పోతున్నా సరే వైసీపీ కుట్రలు మాత్రం ఆపట్లేదు. తాజాగా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇలాంటి ప్రయత్నమే చేసింది. వాస్తవానికి వర్షానికి ఉల్లి తడిసిపోతే మొలకలు వస్తుంది. అలా మొలకలు వచ్చిన ఉల్లిని పశువులకు రైతులే దాణా కింద వేస్తుంటారు. ఇలా పశుగ్రాసం కింద వేసే ఉల్లిని సంచుల్లో నింపి ఓ చెరువులో ట్రాక్టర్ ద్వారా పడవేసి దాన్ని వీడియోలు తీయించి.. రైతులకు తీవ్ర నష్టం అంటూ నానా కథలు సృష్టించారు. దీంతో రైతులు అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అసలు కథ బట్టబయలైంది. లోకల్ లీడర్ వైకుంఠం జ్యోతి ప్రసాద్ ఈ డ్రామాకు సంబంధించిన సాక్షాలను బయట పెట్టడంతో వైసిపి నేతలు సైలెంట్ అయిపోయారు. ఇలా ప్రతిసారి ఏదో ఒక ఎత్తుగడలు వేయడం.. చివరకు బొక్క బోర్లా పడటం వైసీపీకి అలవాటైపోయింది. వాళ్ల తీరు చూసి చివరకు రైతులకే విసుగు పుడుతుంది.

Tags

Next Story