AP: షర్మిలతో విజయసాయిరెడ్డి రహస్య భేటీ.. ?

AP: షర్మిలతో విజయసాయిరెడ్డి రహస్య భేటీ.. ?
X
దాదాపు మూడు గంటలపాటు సాగిన సమావేశం... ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ

రాజకీయాల నుంచి వైదొలిగిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి .. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారన్న వార్త వైసీపీలో ఆందోళనను రేకెత్తించింది. లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో షర్మిలతో విజయసాయి దాదాపు దాదాపుగా మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇందులో రాజకీయ అంశాలపైనా మాట్లాడుకున్నారని చెబుతున్నారు.రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటలపాటు రాజకీయ అంశాలపై చర్చించారని తెలుస్తోంది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారని... మాజీ సీఎం, ఆయన సోదరి షర్మిల మధ్య కుటుంబ, రాజకీయ సంబంధాలు సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఉప్పు, నిప్పులా ఉన్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి షర్మిలను కలవడం రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలకు తావిస్తోంది.

గతంలో షర్మిలపై అనుచిత విమర్శలు

విజయసాయిరెడ్డిపై అనేక సందర్భాల్లో షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిలపై కేసు వేసినప్పుడు జరిగిన వివాదంలో విజయసాయిరెడ్డి .. షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్లారని మండిపడ్డారు. ఈ అంశంపై షర్మిల కూడా మనస్థాపానికి గురయ్యారు. విజయసాయిరెడ్డి చాలా కాలంగా వైఎస్ కుటుంబానికి ఆప్తుడిగా ఉన్నారు. విజయసాయిరెడ్డి సమక్షంలోనే ఆస్తుల గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని ఆమె అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం అలాంటిదేమీ లేదని షర్మిలపైనే విమర్శలు గుప్పించారు.

ఇంతకీ భేటీ ఎందుకు

రాజకీయంగా సన్యాసం తీసుకున్న తర్వాత షర్మిలతో భేటీ అవడానికి కారణాలేమిటన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆస్తుల వివాదంలో తాను జగన్ తరపున ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో షర్మిలకు వివరణ ఇచ్చారని అంటున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వాటి ప్రభావంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎదిగే అవకాశం ఉందన్న అంశంపైనా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. తాను ఎందుకు రాజ్యసభకు రాజీనామా చేయాల్సి వచ్చిందో విజయసాయికి షర్మిల చెప్పినట్లుగా తెలుస్తోంది. కూటమికి తాను రాజీనామా చేసిన సీటు వెళ్తుందని తెలిసినా రాజీనామా చేశానని .. తప్పని పరిస్థితులు ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

Tags

Next Story