PALNADU: పల్నాడులో బరితెగించిన వైసీపీ

PALNADU: పల్నాడులో బరితెగించిన వైసీపీ
X
దాడులు, బెదిరింపులతో బీభత్సం.... తెలుగుదేశం ఏజెంట్లపై కత్తులు, గొడ్డళ్లతో దాడులు

పల్నాడులో ఐదేళ్లగా దాడులు, బెదిరింపులతో రాజకీయం చేస్తున్న వైసీపీ నేతలు ఎన్నికల రోజునా అదే కొనసాగించారు. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి గ్యాంగ్‌ సోమవారం పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే... రెంటచింతల మండలం రెంటాలలో ముగ్గురు తెలుగుదేశం ఏజెంట్లపై..... కత్తులు, గొడ్డళ్లతో దాడులకు తెగబడ్డారు. ఎంత ధైర్యముంటే.... తెలుగుదేశం ఏజెంట్లుగా కూర్చుంటారంటూ దాడికి తెగబడ్డారు.! ముగ్గురు ఏజెంట్లలో ఓ మహిళ ఉండగా ఆమె నుదటిపైనా కత్తితో గాయపరిచారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడ్డారు.

రెంటచింతల మండలం పాల్వాయిగేటులో ఎమ్మెల్యే పిన్నెల్లి దగ్గరుండి మరీ తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేయించారు. తిరగబడ్డ తెలుగుదేశం శ్రేణులు...... ఎమ్మెల్యే కారుపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కుమారుడికి.... రాయి తగిలి గాయమైంది. పిన్నెల్లి స్వగ్రామం, కండ్లకుంటలో C.C. కెమెరాలు పనిచేయకుండా ఉండేందుకు పోలింగ్‌ ప్రారంభమైన అరగంటకే విద్యుత్‌సరఫరా నిలిపివేశారు. తెలుగుదేశం ఏజెంట్లను బయటకు పంపి ఏకపక్షంగా ఓట్లు వేసుకున్నారు. వెల్దుర్తి మండలం కేపీగూడెంలో వైసీపీ వర్గీయులు కత్తులు, కర్రలతో పోలింగ్‌ కేంద్రంలోకి జొరబడి తలుపులు మూసేసి తెలుగుదేశం ఏజెంట్లను దారుణంగా కొట్టారు. విధుల్లో ఉన్న S.I. తెలుగుదేశం ఏజెంట్లను తన కారులో తీసుకెళ్లి మండాదిలో విడిచిపెట్టారు. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో వచ్చి తెలుగుదేశంకు ఓటేస్తారనే అనుమానం వచ్చిన వారిపై ఇష్టారీతిన దాడులు చేశారు.


మాచర్ల తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ మూకలు వ్యూహాత్మక దాడులకు తెగబడ్డాయి. ఓటింగ్‌ సరళిని పరిశీలించేందుకు.. వెళ్లిన ప్రతిచోటా అడ్డుకుని ఘర్షణలకు దిగాయి. రెంటాలలో వైసీపీ నాయకుల చేతిలో గాయపడిన తెలుగుదేశం ఏజెంట్లను పరామర్శించేందుకు బ్రహ్మారెడ్డి వెళ్లగా... వైసీపీ మూకలు రాళ్లు, కర్రలతో బ్రహ్మారెడ్డి వాహనశ్రేణిపై దాడి చేశారు. 6 కార్లను...... పగులగొట్టారు. బ్రహ్మారెడ్డి కళ్లల్లో కారం చల్లేందుకు యత్నించారు. తెలుగుదేశం కార్యకర్తలు...... ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారు. ఘటనను చిత్రీకరిస్తున్న.... మీడియా ప్రతినిధుల కళ్లల్లోకి కారం చల్లారు. ధ్వంసమైన కార్లను తెలుగుదేశం నేత కేశవరెడ్డి మాచర్లకు తీసుకురాగా ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డి కేశవరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆయన అనుచరులపైకి కార్లతో తొక్కించుకుంటూ వెళ్లారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. కేశవరెడ్డి గన్‌మెన్‌ అప్రమత్తమై ఫైరింగ్‌ చేసేందుకు సిద్ధమవడంతో వైసీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం బ్రహ్మారెడ్డి అక్కడి నుంచి వెల్దుర్తి మండలం లచ్చన్నబావి తండాలో పోలింగ్‌ పరిశీలనకు వెళ్లగా.. మరోసారి దాడి చేసి కాన్వాయ్‌లోని ఒక కారును కాల్చేశారు. మాచర్ల ఆరాచకాలపై జోక్యం చేసుకున్న ఎన్నికల సంఘం పిన్నెల్లి సోదరులను గృహనిర్బంధం చేసింది. ఆ తర్వాత పోలింగ్ ఒకింత సాగింది.

గురజాల నియోజకవర్గం తంగెడలో దొంగఓట్ల వ్యవహారంలో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో...... వైసీపీ నేతలు నాటుబాంబులు విసిరి భయానకవాతావరణాన్ని సృష్టించారు. బాంబులతో పాటు పెట్రోల్‌ సీసాలు విసరడంతో మంటలు చెలరేగి అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. నకిరికల్లు మండలం చీమలకుర్తిలో పోలింగ్‌ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న వైసీపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేశారు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం పోలింగ్‌ కేంద్రాన్నితన ఆధీనంలోకి తీసుకునేందుకు మంత్రి అంబటి రాంబాబు యత్నించారు. అయితే తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అక్కడకి రావడంతో అంబటి జారుకునేందుకు యత్నించారు. తెలుగుదేశం శ్రేణులు అంబటిని అడ్డుకుని ఆయనపైకి దూసుకెళ్లాయి. పోలీసుల సాయంతో అంబటి అక్కడి నుంచి బయటపడ్డారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ దాడుల్లో 100 మంది వరకు... తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు.

Tags

Next Story