Konaseema District: కోనసీమ అల్లర్ల వెనుక వైసీపీ హస్తం.. ఆ ఆడియోనే ఆధారం..

Konaseema District: కోనసీమ అల్లర్ల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆధారాలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి.. వైసీపీ ఎంపీటీసీపై మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి బెదిరిస్తున్నట్లుగా ఆడియో ఒకటి కలకలం రేపుతోంది.. అసభ్య పదజాలంతో ఎంపీటీసీ అడపా సత్తిబాబును బెదిరిస్తున్న ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.. రెండు కాళ్లు విరిచేస్తా, అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు..
కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లు జరిగాయి.. ఈ అల్లర్లలో మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు.. ఈ అల్లర్లకు సంబంధించి వైసీపీ ఎంపీటీసీ సత్తిబాబుపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా.. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. తాజాగా ఎంపీటీసీకి మంత్రి తనయుడు ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com