YS Jagan : అప్పటి కుట్రలు రిపీట్ చేస్తున్న వైసీపీ.. కూటమి అలర్ట్..

YS Jagan : అప్పటి కుట్రలు రిపీట్ చేస్తున్న వైసీపీ.. కూటమి అలర్ట్..
X

వైసీపీ నేతలకు డెవలప్ మెంట్ గురించి మాట్లాడటం చేత కాదు. ఎందుకంటే వాళ్ల ప్రభుత్వ హయాంలో ఎలాంటి డెవలప్ మెంట్ జరగలేదు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రజలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి కంపెనీలు వస్తుంటే దేశమే ఆశ్చర్యపోతోంది. దెబ్బకు కూటమి ప్రభుత్వ ఇమేజ్ డబుల్ అవుతోంది. దీంతో వైసీపీ రగిలిపోతోంది. తమ హయాంలో లేని అభివృద్ధి గురించి తాము మాట్లాడితే ప్రజలు ఛీ కొడుతారనే ఉద్దేశంతో తమకు అలవాటైన కులాల మధ్య కుట్రలకు తెర తీస్తోంది. 2014-19 టైమ్ లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎన్ని కుట్రలు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆ టైమ్ లో ఏపీలో ఎక్కడ ఏం జరిగినా సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి అంటగట్టి తప్పుడు ప్రచారాలు చేసింది. అప్పట్లో రిశితేశ్వరి అనే స్టూడెంట్ ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దాన్ని అధికార పార్టీ సామాజిక వర్గానికి అంటగట్టి వైసీపీ ప్రజలను రెచ్చగొట్టింది. అప్పట్లో అలాంటి ప్రచారాలతో వైసీపీ బాగానే సక్సెస్ అయింది. కానీ అప్పట్లో సీఎం చంద్రబాబు వైసీపీ కుట్రలను పసిగట్టలేకపోయారు. ఎంతసేపు కొత్త రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, కొత్త రాజధానిని ఎలా కట్టాలి అనే బిజీలో పడి వైసీపీ చేస్తున్న అరాచకాలను సీరియస్ గా తీసుకోలేదు. ఆ టైమ్ లో వైసీపీ చేసిన కులాల మధ్య చిచ్చులు ఆ పార్టీకి అధికారాన్ని తెచ్చిపెట్టాయి.

ఇప్పుడు మరోసారి అలాంటి కుట్రలను రిపీట్ చేసి గెలవాలని చూస్తోంది వైసీపీ పార్టీ. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే కులాల ప్రస్తావన తెచ్చి రెచ్చగొడుతోంది. తమ్మిని, బమ్మిని చేసి భూతద్దంలో చూపించి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. కందుకూరులో జరిగింది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ. హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మీనాయుడును చంపి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. అది కులాల మధ్య జరిగింది కాదు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలే కారణం. కానీ వైసీపీ ఇలాంటి కుట్రలు చేయడంతో సీఎం చంద్రబాబు కూడా అలెర్ట్ అయ్యారు. భారీగా పరిహారం ప్రకటించి, నిందితుడిని శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే సీఎం చంద్రబాబు స్పందిస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేదాకా ఊరుకోవట్లేదు. నిందితులది ఏ కులం అయినా విడిచిపెట్టట్లేదు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టి మరోసారి ఆ పార్టీకి అవకాశం ఇవ్వొద్దని కూటమి ఇలా ముందుకెళ్తోంది. పోలీసుల తీరుపై కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి గట్టి ఆదేశాలు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. కూటమి ఇలాగే అలర్ట్ గా ఉండి ముందుకు వెళ్తే వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా లాభం లేదు.

Tags

Next Story