పట్టాభి నేతృత్వంలోని బృందంపై వైసీపీ నేతల దాడి..

పట్టాభి నేతృత్వంలోని బృందంపై వైసీపీ నేతల దాడి..
ఏపీలో దాడుల పరంపర కొనసాగుతోంది. అక్రమ మైనింగ్‌ను పరిశీలించందుకు వెళ్లిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నేతృత్వంలోని..

ఏపీలో దాడుల పరంపర కొనసాగుతోంది. అక్రమ మైనింగ్‌ను పరిశీలించందుకు వెళ్లిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నేతృత్వంలోని బృందంపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు.. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.. వైసీపీ దాడిలో టీడీపీ నేత సజ్జా అజయ్‌కి గాయాలయ్యాయి.. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.. ఇబ్రహీంపట్నంలో అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలను పరిశీలించేందుకు పట్టాభి నేతృత్వంలో టీడీపీ బృందం వెళ్లింది.. తిరుగు పయనంలో ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న సమయంలో 15 మంది దుండగులు వారిని చుట్టుముట్టారు.. దాడికి తెగబడ్డారు.. దాడిలో అజయ్‌కి గాయాలయ్యాయి..

టీడీపీ ప్రతినిధి బృందంపై వైసీపీ నేతల దాడి దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ నేతల దోపిడీని బయటపెట్టారనే అక్కసుతోనే దాడికి తెగించారని ఫైర్ అయ్యారు. అక్రమ మైనింగ్ చేసేవారిని, టీడీపీ నేతలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కొండపల్లి బొమ్మల ఖ్యాతిని ప్రధాని మోదీ కొనియాడారని, బొమ్మల తయారీకి వాడే చెట్లను వైసీపీ నేతలు నరికేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

అటు ఈ ఘటనపై టీడీపీ నేతల బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.. సమీపంలోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అటు ఈ ఘటనపై విజయవాడ సీపీని కలిసి టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. వైసీపీ నేతల దాడితోపాటు రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలకు సంబంధించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story