Nellore: వైసీపీలో వర్గవిభేదాలు.. సొంతపార్టీ ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్న నేతలు..

Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు రోజులక్రితం సొంత పార్టీ నేతలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అసభ్యకర పదజాలంతో దూషించగా.. ఆయన ప్రత్యర్ధి వర్గం నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నియోజకవర్గంలో అంగన్వాడీ పోస్టుల నుంచి అన్నింటిని అమ్ముకుంటున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాటలు బాధించాయని.. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు.
ఉదయగిరిలో ఏ సెంటర్‌కి రమ్మన్నా వస్తాము.. ఎవరు ఏమిటో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గం సవాల్ విసురుతోంది. మా శ్రమతో గెలిచి అందలం ఎక్కిన శేఖర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా రాదని.. ఒకవేళ వచ్చినా తాము సహాకరించమంటూ ప్రత్యర్ధం వర్గం నాయకులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com