ఏపీలో సీఎం జగన్మోహన్‌రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది : ఎంపీ రఘురామ

ఏపీలో సీఎం జగన్మోహన్‌రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది : ఎంపీ రఘురామ
ఏపీలో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు..

ఏపీలో ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. రైతులను ఒప్పించి భూములు తీసుకొని రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం మంచి స్కీం ప్రవేశపెట్టిందన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని ఇప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి... ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ఏపీలో అమలవ్వడంలేదని అభిప్రాయపడ్డారు ఎంపీ రఘురామ.

Tags

Next Story