చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్‌లను వైసీపీ కైవసం..!

చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్‌లను వైసీపీ కైవసం..!
చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్‌లను వైసీపీ కైవసం చేసుకుంది. తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గానూ వైసీపీ 48, టీడీపీ ఒక్క డివిజన్‌ను గెలుపొందింది.

చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్‌లను వైసీపీ కైవసం చేసుకుంది. తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గానూ వైసీపీ 48, టీడీపీ ఒక్క డివిజన్‌ను గెలుపొందింది. చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గానూ వైసీపీ 46, టీడీపీ 1, ఇండిపెండెంట్ ఒక్క సీటు గెలుపొందారు. అటు పలమనేరు, మదనపల్లె, పుత్తూరు, నగరి, మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది.

పలమనేరు మున్సిపాలిటీలో వైసీపీ 26 వార్డులు గెలుపొందగా.. మదనపల్లెలో వైసీపీ 33, టీడీపీ 2 వార్డుల్లో గెలుపొందింది. ఇక పుత్తూరు మున్సిపాలిటీలో వైసీపీ 21, టీడీపీ 6 వార్డులు కైవసం చేసుకోగా.. నగరిలో వైసీపీ 25, టీడీపీ 3, వైసీపీ రెబల్ అభ్యర్థి 1 వార్డు గెలుచుకున్నారు.

అటు విజయవాడతోపాటు మచిలీపట్నం కార్పొరేషన్‌ వైసీపీ కైవసం చేసుకుంది. విజయవాడ కార్పొరేషన్‌లో మొత్తం డివిజన్లు 64 ఉండగా వైసీపీ-34, టీడీపీ-12 డివిజన్లలో గెలుపు సాధించింది. అటు మచిలీపట్నం కార్పొరేషన్ సైతం వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 50 స్థానాలకు గాను 27 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ -4, జనసేన- 1డివిజన్‌లో గెలుపు సాధించింది.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లో వైసీపీ హవా కొనసాగింది. 268 వార్డులుండగా.. 35 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 233 వార్డులకు పోలింగ్ జరగగా.. వైసీపీ అత్యధికంగా 218 వార్డులు గెలుచుకుంది. టిడిపి 34, జనసేన 8, ఇండిపెండెంట్లు 8 వార్డుల్లో విజయం సాధించాయి.

కడప జిల్లాలో రాచోటి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు మున్సిపాలిటీలను వైసీపీ గెలుపొందింది. రాయచోటి, ఎర్రగుంట్లు మున్సిపాలిటిలలో వైసీపీ గెలుపొందింది.

ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో 32 వార్డులు గానూ వైసీపీ 31, టీడీపీ ఒక వార్డులో గెలుపొందింది. జమ్మలమడుగు మున్సిపాలిటిలో మొత్తం 20 వార్డులు గానూ 19 వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో బీజేపీ గెలుపొందింది. ఇక బద్వేలు మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు గానూ 28 వార్డుల్లో వైసీపీ, 3 వార్డుల్లో టీడీపీ, 4 వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. అటు మైదుకూరు మున్సిపాలిటిలో మొత్తం 24 వార్డులు గానూ 12 వార్డుల్లో టీడీపీ, 11 వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో జనసేన విజయం సాధించింది.

అటు ప్రకాశం జిల్లా మర్కాపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. మార్కాపురంలో వైసీపీ-30, టీడీపీ-4. జనసేన-1 వార్డులో విజయం సాధించాయి. అలాగే కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. గిద్దలూరు మున్సిపాలిటీలో వైసీపీ-17, టీడీపీ-2, ఇండిపెండెంట్-1 వార్డులో గెలుపొందగా.. చీమకుర్తి మున్సిపాల్టీలో వైసీపీ-19, టీడీపీ ఒక వార్డు కైవసం చేసుకుంది. అద్దంకిలో వైసీపీ-12, టీడీపీ-7 వార్డులు, చీరాల మున్సిపాలిటీలో వైసీపీ-22, టీడీపీ ఒక వార్డుల్లో విజయం సాధించాయి.

మరోవైపు విజయనగరం జిల్లాలో 3 మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. బొబ్బిలి మున్సిపాలిటీలో వైసీపీ గెలుపొందింది. చివర వరకు టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియలో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. బొబ్బిలిలో టీడీపీ 11 వార్డుల్లో గెలుపొందగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. అటు పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డులకు గానూ వైసీపీ 16, టీడీపీ 5, స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. ఇటు సాలూరులో 29 వార్డలకు గానూ వైసిపి 20, టిడిపి 5, కాంగ్రెస్ 1, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గెలుపొందారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో వైసీపీ 11, టీడీపీ 7, వైసీపీ రెబెల్ ఇద్దరు గెలుపొందారు.

Tags

Read MoreRead Less
Next Story