Andhra Pradesh: రాష్ట్రానికి మూడు రాజధానులే అన్న సీఎం.. ఒత్తిడితో ఆగిన యువకుడి గుండె..
![Andhra Pradesh: రాష్ట్రానికి మూడు రాజధానులే అన్న సీఎం.. ఒత్తిడితో ఆగిన యువకుడి గుండె.. Andhra Pradesh: రాష్ట్రానికి మూడు రాజధానులే అన్న సీఎం.. ఒత్తిడితో ఆగిన యువకుడి గుండె..](https://www.tv5news.in/h-upload/2022/03/25/680223-ap.webp)
Andhra Pradesh: ఏపీ రాజధానిలో మూడు ముక్కలాటకు మరో మైనార్టీ యువకుడు బలయ్యాడు. ఆవేదనతో రాయపూడి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ షేక్ ఇస్మాయిల్ కన్నుమూశాడు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ ప్రకటనను తట్టుకోలేక... మదనపడి గుండెపోటుకు గురై మృతి చెందినట్లు యువకుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూసినట్లు చెబుతుబున్నారు.
ఇస్మాయిల్ మృతితో రాయపూడిలోని మైనార్టీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మూడేళ్ల నుంచి పనులు లేక... జీవనోపాధి కోసం ఎదురు చూసిన ఇస్మాయిల్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదంటున్నారు. పూలింగ్‌లో పొలం ఇచ్చిన తమకు న్యాయం జరగలేదన్నారు. నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ కారణంగా ఇస్మాయిల్ మనోవేధనకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com