Canada : కెనడాలో గాజువాక యువకుడు మృతి

కెనడాలోని కాల్గరీలో ఉన్న సదరన్ అల్బెర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఏఐటీ) కాలేజీలో ఎంఎస్ చదవడానికి వెళ్లిన గాజువాక చట్టివానిపాలెంకు చెందిన పిల్లి ఫణికుమార్ డిసెంబర్ 14న ఆయన ఉంటున్న గదిలో చనిపోయారు. కెనడాలో ఎంఎస్ చదవడానికి గాజువాక ప్రాంతానికి చెందిన ఫణికుమార్ 2024 ఆగస్టు నెలలో వెళ్ళాడు. డిసెంబర్ 14 ఉదయం తనతో పాటు గదిలో ఉంటున్న వ్యక్తి ఫణికుమార్ మరణించినట్లు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు షాక్ కు గురవడంతో చట్టివానిపాలెం ప్రాంతమంతా విషాదఛాయలు అల్లుకున్నాయి. తండ్రి పిల్లి నాగప్రసాద్ తన కుమారుడు మృతదేహాన్ని కెనడా నుంచి భారతదేశానికి తీసుకుని రావడానికి సహకరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభ్యర్థించగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఢిల్లీలో ఉన్న విశాఖ ఎంపీ భరత్ మాట్లాడి ఫణికుమార్ వివరాలను ఈమెయిల్ ద్వారా పంపించారు. అనంతరం ఎంపీ భరత్ జిల్లా కలెక్టర్ మాట్లాడి ఫణికుమార్ తల్లిదండ్రులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తమ కుమారుడి మృతదేహాన్ని భారతదేశానికి వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకొని ఫణికుమార్ మృతదేహం స్వగ్రామం వచ్చే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు ప్రాధేయ పడుతూ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com