YS Jagan: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు.. హాజరు మినహాయింపు విషయంలో..

X
YS Jagan (tv5news.in)
YS Jagan: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. హాజరు మినహాయింపు కోరుతూ జగన్ తరుపు న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు. ప్రతి విచారణకు మినహాయింపు కోరుతున్నారని సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించింది. అయితే.. హాజరు మినహాయింపుపై హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు జగన్ తరపు న్యాయవాది. హైకోర్టులో తీర్పు రావాల్సి ఉందన్నారు. త్వరలోనే తీర్పు రానుందని సీబీఐ కోర్టుకు తెలిపారు. దీంతో మెమో రూపంలో సమర్పించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు మెమో దాఖలు చేశారు జగన్ తరుపు న్యాయవాది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
