YS Jagan: రాబోయే రెండేళ్లలో రాష్ట్రానికి 56 పెద్ద కంపెనీలు: సీఎం జగన్

YS Jagan: ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని సీఎం వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో 56 పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. ఏపీలో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని.. అదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలు ఏపీవైపు చూస్తున్నారని జగన్ అన్నారు. విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ అలయన్స్ టైర్స్ కంపెనీని ప్రారంభించారు సీఎం జగన్.
జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్ 2వేల 200వందల కోట్లతో అలయన్స్ టైర్స్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో 1,384 కోట్లతో హాఫ్ హైవే టైర్ల తయారీ కంపెనీ నిర్మాణం పూర్తైంది. నేటి నుంచి అక్కడ టైర్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఇక 816 కోట్లతో రెండో దశ పనులకు భూమి పూజ చేశారు జగన్. అలాగే రూ.1,002 కోట్లతో మరో 8 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. మొత్తం 250 ఎకరాల్లో ఈ ఏటీసీ పరిశ్రమ ఏర్పాటైంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 4,664 మందికి ఉపాధి లభించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com