YS Jagan: సినిమా టికెట్ ధరల చర్చపై సానుకూలంగా స్పందించిన జగన్..

X
YS Jagan: పెద్ద సినిమాలకు,చిన్న సినిమాలకు న్యాయం జరిగే విధంగా కసరత్తు జరుగుతోందన్నారు ఏపీ సీఎం జగన్. రాష్ట్రంలో షూటింగ్ చేయాలన్న నిబంధన పెడితే ఇక్కడ కూడా లాభం జరుగుతుందన్నారు. కనీసం 20 శాతం ఏపీలో షూటింగ్ చేయాలన్న నిబంధన పెడతామన్నారు. అందరికీ ఒకే టికెట్ రేట్లు ఉండాలన్నారు.
ఆన్‌లైన్ టికెట్ విక్రయం ప్రభుత్వానికి మంచిదన్నారు. సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిదన్నారు. సినిమా పరిశ్రమ నెమ్మదిగా విశాఖ రావాలన్నారు జగన్. విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా అని హామీ ఇచ్చారు. స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే వాళ్లకు కూడా స్థలాలిస్తామన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రనే సినిమా పరిశ్రమకు ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
