YS Jagan : జగన్ లండన్ ఎందుకు వెళ్తున్నారో తెలుసా?
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. తన పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఐదేళ్ల పాటు పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేయాలని ఆదేశించింది. దీంతో జగన్ లండన్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. కాగా సీఎంగా ఉన్న సమయంలో జగన్‌కు డిప్లొమాట్ పాస్ పోర్టు ఉండేది. ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ పాస్ పోర్టు రద్దు అయింది. జనరల్ పాస్ పోర్టు కోసం జగన్ దరఖాస్తు చేశారు. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసుపై ఎన్‌వోసీ తీసుకోవాలని జగన్‌కు ఇటీవల పాస్ పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. దీంతో ఎన్‌వోసీ ఇవ్వాలంటూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఒక సంవత్సరం పాటు పాస్ పోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం జగన్‌కు పాస్ పోర్టును ఐదేళ్లు రెన్యువల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
లండన్ పర్యటన కోసం అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో గతంలో జగన్ పిటిషన్ దాఖలుచేశారు. వాస్తవానికి వైఎస్ జగన్ సెప్టెంబర్ మూడో తేదీన సతీసమేతంగా లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. లండన్‌లో చదువుతున్న కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25వ తేదీ వరకు అక్కడే ఉండాలని భావించారు. అయితే పాస్‌పోర్ట్ ఇబ్బందులతో లండన్ ప్రయాణం వాయిదా పడినప్పటికీ ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. జగన్ ఆగస్టులో సతీమణితో కలిసి విజయవాడలోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. డాక్యుమెంట్లు, ఆధారాలు, ఇద్దరు వేలి ముద్రలు వేసి, ఐరీష్ పూర్తి చేశారు. పాస్ పోర్టు రెన్యువల్ ప్రక్రియను అధికారులు కేవలం 20 నిముషాల వ్యవధిలో పూర్తి చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com