YS Jagan: విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్..

YS Jagan (tv5news.in)
YS Jagan: ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై అధికారులతో సమీక్షించారు. అలాగే ఆరు కేటగిరీల కింద స్కూళ్ల ఏర్పాటు.. మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, ఇంగ్లీష్ మీడియంలో బోధన, డిజిటల్ లెర్నింగ్, మండలానికి రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు.
విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరును సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ఉన్నారని, వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే నాణ్యమైన విద్య అందుతుందని జగన్ అధికారులకు సూచించారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల్లో వినియోగించకుండా చూడాలని, కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com