YS Jagan : 28న తిరుమలకు జగన్.. అదేరోజు ఆలయాల్లో వైసీపీ పూజలు

YS Jagan : 28న తిరుమలకు జగన్.. అదేరోజు ఆలయాల్లో వైసీపీ పూజలు
X

తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారనీ.. ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల 28న ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టాలంటూ వైసీపీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు అపవిత్రం చేశారని జగన్ మండిపడ్డారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిదే జరిగినట్టుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు అబద్ధాలాడారన్నారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో 28న ప్రత్యేక పూజలు చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు అదే రోజు తిరుమలకు జగన్ వెళ్లనున్నారు.

Tags

Next Story