YSRCP : తప్పుచేసి.. టిడిపిపై నిందలు వేస్తున్న వైసిపి

YSRCP  : తప్పుచేసి.. టిడిపిపై నిందలు వేస్తున్న వైసిపి
X

వైసిపికి మొదటి నుంచి తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అవతలి పార్టీపై నిందలు వేయడం అలవాటు అయిపోయింది. మొన్న శాసనమండలిలో వైసిపి ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకుని తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. దేవుడు ఫోటోలను చెప్పులు, బూట్లతో పట్టుకోవద్దు అనే విషయం కూడా వారికి తెలియకుండా పోయింది. అంతేకాకుండా దేవుడు ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. వాళ్ల తీరును ప్రతి ఒక్క హిందువు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దారుణమైన పనులు చేస్తే దేవుడు కఠినంగా శిక్షిస్తాడు అంటూ హెచ్చరించారు. దేవుడంటే కనీసం గౌరవం లేదా, భక్తి లేదా అంటూ ఏకిపారేస్తున్నారు హిందూ భక్తులు. హిందూ సమాజంలో వ్యతిరేకత రావడంతో దెబ్బకు వైసిపి రూటు మార్చేసింది.

టిడిపి నేతల మీద నిందలు మోపడానికి రెడీ అయింది. గతంలో నారా లోకేష్ చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి విగ్రహం పట్టుకున్నారని, చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని దేవుడి చిత్రపటాన్ని బహుకరించారు అంటూ కొన్ని ఏఐ ఫోటోలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. అంటే ఇక్కడ తాము తప్పు చేసామని ఒప్పుకోకుండా ఇతర పార్టీలపై నిందలు వేసి దాన్ని కవర్ చేయాలని చూడటం ఎంత దారుణం అసలు. ముందు తాము చేసిన పనికి వివరణ ఇవ్వాలి కదా. కానీ అది చేయకుండా ఇతరులపై నిందలు మోపడం అంటే చేసిన తప్పును అంగీకరించినట్టే అవుతుంది.

కానీ ఇక్కడ వైసిపి నేతలు తీరు ఎలా ఉంది అంటే వాళ్ళు ఏం చేసినా సరే ప్రశ్నించవద్దు ఎవరైనా ప్రశ్నిస్తూ అవతల వారి మీద నిందలు వేయడానికి ఎంతకైనా తెగిస్తామనేలా ప్రవర్తిస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి కోట్లాదిమంది హిందువులతో తినిపించిన పాపం వైసిపి నేతలు మూట కట్టుకొని.. ఇప్పుడు దాన్ని టిడిపి మీదకు నెట్టివేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా సరే హిందూ సమాజం వారిని క్షమించదు అనే విషయం తెలుసుకోవాలి అంటున్నారు కూటమి నేతలు.

Tags

Next Story