Andhra Pradesh: కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో ఉద్రిక్తత

కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో ఉద్రిక్తత నెలకొంది.కవ్వింపు చర్యలకు దిగాయి వైసీపీ శ్రేణులు.లోకేష్ పాదయాత్ర చేసే మార్గంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫ్లెక్సీల దగ్గర భారీగా గుమిగూడారు వైసీపీ కేడర్.రెచ్చగొట్టేందుకు ప్రయత్నంచిన వైసీపీ కార్యకర్తలను చితకబాదారు టీడీపీ కార్యకర్తలు.
మరోవైపు జగన్ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు లోకేష్.పట్టిసీమ కాలువను పరిశీలించిన ఆయనప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోకపోవడంతో..అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని అన్నారు.టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు 68 వేల 294 కోట్లు ఖర్చు చేసిందని అందులో వైసీపీ ప్రభుత్వం నాలుగోవంతు ఖర్చు చేయలేదన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏలూరు కాలువకు పోలవరం కాలువను అనుసంధానం చేస్తామని అన్నారు లోకేష్.
ఇక లోకేష్‌ను కలిసిన కోడూరుపాడు గ్రామస్తులు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.జగన్ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించాడని అన్నారు.మిషనరీలకు చెందిన వేల కోట్ల ఆస్తులను కొట్టేసేందుకు..విలీనం పేరుతో డ్రామాకు తెరలేపారని అన్నారు.జగన్ అనాలోచిత నిర్ణయంతో 4 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారుని అన్నారు.
గన్నవరం నియోజక వర్గంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్‌కు ఘన స్వాగతం లభిస్తోంది.లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తల తోపాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా నారా లోకేష్.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com