సీమలో విజయవంతంగా యువగళం

సీమలో విజయవంతంగా యువగళం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటితో రాయలసీమ జిల్లాల్లో విజయవంతంగా పూర్తి కానుంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటితో రాయలసీమ జిల్లాల్లో విజయవంతంగా పూర్తి కానుంది. 124 రోజులుగా 44 నియోజకవర్గాల్లో 1587 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రకు.. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అధికార వైసీపీ సృష్టించిన అడ్డంకులు అవరోధాలను అవలీలగా అధిగమిస్తూ యువనేత నారా లోకేష్ విజయవంతంగా అడుగులు ముందుకు వేశారు. సీమ జిల్లాల వెనుకబాటు తనంపై సమగ్రాభివృద్ధికై ప్రణాళికలో భాగంగా మిషన్ రాయలసీమ సదస్సును ఏర్పాటు చేశారు. తాము చేపట్టే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు సవివరంగా విశదీకరించారు. మిషన్ రాయలసీమ పేరుతో సీమవెనుకబాటుతనాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story