Yuvagalam: చరిత్ర సృష్టిస్తున్న యువగళం పాదయాత్ర

యువగళం 200 రోజులకు చేరిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు సంఘీభావ పాదయాత్రలు నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లే అన్నట్లుగా లోకేష్ పాదయాత్ర సాగుతుందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. సత్యసాయి జిల్లా మడకశిరలోని ఆంజనేయస్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువగళానికి సంఘీభావం తెలుపుతూ పాదయాత్ర చేశారు.
గుంతకల్‌లో వాల్మీకి సర్కిల్‌లో వాల్మీకి మహర్షికి టీడీపీ నేతలు పూలమాలలు వేశారు. యువగళం సంఘీభావ యాత్ర చేపట్టారు. దీంతో పట్టణంలో కోలాహలం నెలకొంది. సమకాలీన ఉద్యమ చరిత్రకు యువగళం మైలురాయిగా నిలుస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి నుంచి టీడీపీ నేతలు యువగళానికి సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. యువగళం దిగ్విజయంగా సాగుతుందన్నారు జీవీ ఆంజనేయులు. కోనసీమ జిల్లా అల్లవరంలో టీడీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. యువగళం 200 రోజులకు చేరిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. యువగళంతో ప్రభుత్వంలో వణుకు మొదలైందన్నారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ బంగార్రాజు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. యువగళం 200 రోజులకు చేరడంతో సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com