Jagan Name In Tirumala : జగన్‌రెడ్డి రక్షణ గోవిందా గో..విందా!

X
By - TV5 Digital Team |13 Oct 2021 1:59 PM IST
Jagan Name in Tiriumala : బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్.. తిరుమలలో మంగళవారం తులాభారం మొక్కు చెల్లించుకున్నారు.
Jagan Name in Tiriumala : బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్.. తిరుమలలో మంగళవారం తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. రంగనాయక మండపంలో జగన్ తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పిన్ని, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత బిగ్గరగా గోవింద నామస్మరణ చేశారు. ఏడు కొండలవాడ... వెంకట రమణ గోవిందా గో... విందా, ఆపద్బాంధవ గోవిందా గో...విందా, అనాథ రక్షక గోవిందా గో.....విందా, జగన్‌రెడ్డి రక్షక గోవిందా గో...విందా అంటూ స్మరించారు. అయితే ఆలయంలో శ్రీవారి నామస్మరణ వినిపించాలే తప్ప ఇలా వ్యక్తి పేర్లతో నామస్మరణలు చేయడం ఏమిటంటూ కొందరు విస్తుపోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com