కొత్తపేట వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం.. కొత్తపేట వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. అమ్మవారి జాతరలో చెలరేగిన వివాదం.. ఘర్షణకు దారి తీసింది.ఇరు వర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు కర్రలతో బీభత్సంగా దాడులు చేసుకున్నారు. మూడు రోజుల క్రితం అమ్మవారి శిరస్సు ఊరేగింపు సందర్భంగా వైసీపీ నాయకులు మునిస్వామి... వాసు వర్గాల మధ్య గొడవ జరిగింది. చివరకు ఘర్షణకు దారి తీసింది. కర్రలతో వెంటాడి.. వేటాడి కొట్టుకున్నారు. బట్టలూడదీసి మరి చితకబాదారు. ఈ ఘటనలో వాసుకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైసీపీ నాయకుడు మునిస్వామితో పాటు మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com