AP : వైసీపీ మొక్కను చెట్టుగా మార్చా.. జగన్‌ను గద్దె దింపి తీరుతా.. షర్మిల శపథం
ఏపీ సీఎం (AP CM), తన సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని (Jagan Mohan Reddy) పదవి నుంచి దించేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శపధం చేశారు. రోజురోజుకూ స్పీడు, విమర్శల వాడి పెంచుతున్న షర్మిల తీరు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్న చర్చ జరుగుతోంది.
తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్ షర్మిల రోడ్ షోలో పాల్గొని బహిరంగ సభలో మాట్లాడారు. ముందు రోజాను ఆ తర్వాత జగన్ ను విమర్శించారు. మధ్యలో కేసీఆర్ తో కలిసి చేసిన లంచ్ పాలిటిక్స్ ను కూడా మిక్స్ చేసి.. తన సబ్జెక్ట్ ను చాటుకున్నారు.
తన అన్న జగనన్న ఓ నియంత.. త్వరలోనే గద్దె దింపుతానని, ఇది నా శపథం అంటూ వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో నియంత కేసీఆర్ ను గద్దె దింపానని, ఏపీలోనూ నియంతను గద్దె దింపి తీరుతానని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చూసినా దోచుకోవడం తప్ప వేరే కనిపించడం లేదన్న షర్మిల ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? అన్నారు.
జబర్దస్త్ రోజా తనపై రెచ్చిపోతోందని.. జబర్దస్త్ గా దోపిడీలో మాత్రం తగ్గడం లేదని సెటైర్లు వేశారు షర్మిల. కేసీఆర్ తో కలిసి భోజనాలు చేసిన జగన్, రోజా ఆంధ్ర హక్కులను నీరుగార్చారని పైరయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com