Satish Kaushik Death Mystery: ఆ డైరెక్టర్ ను మా ఆయనే చంపేశారు...!

Satish Kaushik Death Mystery: ఆ డైరెక్టర్ ను మా ఆయనే చంపేశారు...!
X
సతీశ్ కౌశిక్ మరణంపై కీలక వ్యాఖ్యలు చేసిన బడా వ్యాపారి భార్య; ఆర్ధిక లావాదేవీల్లో వ్యత్యాసం వల్ల తన భర్తే మర్డర్ చేశారంటూ ఆరోపణ

డైరెక్టర్ సతీశ్ కౌశిక్ మరణం సహజమైనది కాదని, అతడు హత్యకు గురయ్యాడని ఢిల్లీకి చెందిన మహిళ కీలక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 15కోట్ల వ్యవహారంలో పొరపొచ్చాలు తలెత్తడంతో తన భర్తే సతీశ్ ను హత్య చేశాడని సదరు మహిళ వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యాఖ్యలపై సతీశ్ కౌశిక్ భార్య శశి కౌశిక్ స్పందించారు. తన భర్త, సదరు మహిళ భర్త మంచి స్నేహితులని స్పష్టం చేశారు. అయితే సతీశ్ కౌశిక్ కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకునేందుకే ఢిల్లీ వచ్చారని ఆమె చెబుతున్నట్లుగా అతడు హత్యకు గురవ్వలేదని స్పష్టం చేశారు. సదరు వ్యాపారవేత్త, సతీశ్ మంచి స్నేహితులని, ఆయన ఎంతో సంపన్నుడని, కాబట్టి ఆయన రూ. 15కోట్ల చిరు నగదు కోసం సతీశ్ ను హత్య చేశాడు అనడంలో ఏమాత్రం నిజం లేదని స్ఫష్టం చేశారు. ఇక సతీశ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సైతం ఆయన హృదయ నాళాల్లో 98శాతం బ్లాకేజ్ ఉందని, ఇక ఇతర డ్రగ్స్ కూడా ఏమీ దొరకలేదని వివరించారు. తనకు తన భర్త మరణంపై ఎలాంటి అనుమానాలూ లేవని, ఆమెకు ఇలాంటి ఆటలు కట్టబెట్టాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Tags

Next Story