Akshaya Tritiya: అక్షయ తృతీయ.. మీరూ బంగారం కొంటున్నారా?

అక్షయ తృతీయ (నేడు) రోజు బంగారం కొనాలని పురాణాల్లో ఎక్కడా లేకున్నా చాలా మంది కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రజల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటూ జ్యువెలరీ షాప్స్.. ఆకర్షణీయ ఆఫర్లతో మగువలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొందరూ మోసాలకూ పాల్పడే అవకాశం ఉంది. కొంతమంది డబ్బులు లేకున్నా అప్పులు చేసి మరీ పసిడి కొంటున్నారు. బంగారం కొనే బదులు దానం చేస్తే పుణ్యఫలం వస్తుందని పండితులు చెబుతున్నారు.
క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్షం తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. అంటే ఈ ఏడాది మే 10 , 2024 శుక్రవారం. హిందూ మతంలో అక్షయ తృతీయ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి , ధంతేరస్ ల మాదిరిగానే ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com