Amul Milk : అమూల్ పాల ధరలు పెంపు

నేటి నుంచి పాల ధరలు పెంచుతూ అమూల్ ప్రకటన విడుదల చేసింది. గేదే పాలు 500 మి.లీ ప్యాకెట్‌పై రూ.2, లీటర్ పాల ప్యాకెట్‌పై రూ.3 పెంచింది. గోల్డ్, తాజా రకం పాలపై లీటర్‌కు రూ.2, హాఫ్ లీటర్‌కు రూ.1 చొప్పున పెంచినట్లు పేర్కొంది. ఆవు పాలు హాఫ్ లీటర్ ప్యాక్, లీటర్ ప్యాక్‌పై రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఖర్చు పెరగడంతోనే ధరలు పెంచినట్లు పేర్కొంది.
ధరల పెంపు అనంతరం ప్రస్తుతం అమూల్ గేదె పాల ధర లీటరుకు రూ.73కి చేరుకుంది. అమూల్ గోల్డ్ పాలు లీటర్ ధర రూ.66 నుంచి రూ.68 కాగా, అమూల్ శక్తి లీటరుకు రూ.60కి చేరుకుంది. అమూల్ తాజా పాల ధర లీటర్ రూ.56 కాగా, ఆఫ్ లీటర్ రూ.28కి చేరింది. అమూల్ గేదె పాలు ఆఫ్ లీటర్ రూ.37, అమూల్ గోల్డ్ ఆఫ్ లీటర్ రూ.34, అమూల్ శక్తి అర్ధ లీటర్ రూ.30 అయింది.
ఫిబ్రవరి 2023 తర్వాత అమూల్ పాల ధరలు పెంచడం ఇదే తొలిసారి. జీసీఎంఎంఎఫ్ గుజరాత్ రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ సాధారణంగా పాల ధరల పెంపు గురించి ముందుగానే ప్రకటిస్తుంది. కానీ తాజాగా పాల ధరను నేరుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com