Pulsar : కొత్త పల్సర్ ఎన్ఎస్.. ధర రూ.1.57 లక్షలు

Pulsar : కొత్త పల్సర్ ఎన్ఎస్.. ధర రూ.1.57 లక్షలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కొత్త పల్సర్ ను విడుదల చేసింది. పాత పల్సర్ కు ఎలాంటి మెకానికల్ మార్పులు చేయకుండానే.. టెక్నికల్ అంశాల్లో అప్ గ్రేడ్ చేసి బైక్ ను అందుబాటులో ఉంచింది. దీనిలో NS200, NS160, NS125 మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.1,57,427, రూ.1,45,792, రూ.1,04,922గా ఉన్నాయి. బ్లూటూత్, ఫోన్ కాల్, SMS అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నూతన డిజిటల్‌ కన్సోలెస్‌ అండ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో తీర్చిదిద్దింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌ను సెమీ-డిజిటల్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఇన్‌కమింగ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌, ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం, సిగ్నల్‌ లెవల్‌, నావిగేషన్‌ కూడా తెలుసుకోవచ్చును. 150 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకుల విక్రయాల్లో ఈ బైకు అత్యధికంగా నమోదవుతున్నది.

ధరలు:

ఢిల్లీ ఎక్స్-షోరూమ్ వద్ద 2024 బజాజ్ పల్సర్ NS160 ధర రూ. 1.46 లక్షలు కాగా, పల్సర్ NS200 రిటైల్ ధర రూ. 1.57 లక్షలు. మార్కెట్లో పల్సర్ NS160 బైక్.. TVS Apache RTR 160 4V, Hero Xtreme 160R లకు ప్రత్యర్థిగా ఉంటుంది, అయితే పల్సర్ NS200 బైక్ మాత్రం TVS Apache RTR 200 4V, హోండా హార్నెట్ 2.0 మొదలైన వాటితో పోటీపడుతుంది.

Tags

Next Story