72 వేల డాలర్ల మార్క దాటిన బిట్ కాయిన్

72 వేల డాలర్ల మార్క దాటిన బిట్ కాయిన్

ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ తొలిసారి 72, 000 డాలర్ల మార్క్ ను దాటింది. కాయిన్స్ కు వివరాల ప్రకారం సోమవారం నాడు ఒక దశలో 72,234 డాలర్ల వద్ద గరిష్టాన్ని నమో దుచేసింది. గత 24 గంటల్లో దా దాపు 2.5 శాతానికి పైగా లాభపడింది. దీంతో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.40 లక్షల కోట్ల డాలర్లు దాటింది. 2024లో ఇప్పటి వరకు ఈ క్రిప్టో విలువ 70 శాతం మేర లాభపడింది. 2021లో అత్యధికంగా 68,991 డాలర్లుగా బిట్ కాయిన్ విలువ ఉంది. 2022 నవంబర్ లో ఇది 15,000 డాలర్లకు పడిపోయింది. స్పాట్ బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లకు అమెరికా నియ ంత్రణా సంస్థలు ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ టోకెన్ విలువ పెరుగుతూ వస్తోంది. త్వరలో అగ్రరాజ్యంలో వడ్డీ రేట్ల కోత ఉండవచ్చన్న సంకేతాలు తాజా ర్యాలీకి దోహదం చేశాయి. మరో వైపు బిట్కాయిన్, ఇథేరియం ఎక్సేంజ్ ట్రేడెడ్ నోట్లకు దరఖాస్తులు స్వీకరించాలని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇది కూడా క్రిప్టోల దూకుడుకు కారణమని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story