Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా

Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్ శంకర్ శర్మ (Vijay Shankar Sharma) తన పదవికి రాజీనామా చేశారు. బ్యాంక్ బోర్డును పునర్ నిర్మించేందుకు వీలుగా ఆయన తప్పుకున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎ ల్)ను రిజర్వ్ బ్యాంక్ మార్చి 15 నుంచి కస్టమర్ల నుంచి డిపాజిట్ల స్వీకరణ, టాప్టాప్లను తీసుకోవాడాన్ని నిషేధించింది. నిబంధనలు పాటించనందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్ మాజీ ఐఏఎస్ అధికారి రజనీ సేఫ్రే సిబల్లలను కొత్తగా పీపీబీఎల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా నియ మించినట్లు సోమవారం నాడు బ్యాంక్ తన రెగ్యులెటరీ ఫైలింగ్ తెలిపింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 సంస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, రిటైర్డ్ ఐఏఎస్ రజనీ సెఖ్రీ సిబల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో చేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com