Chicken Prices : రూ.60పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

Chicken Prices : రూ.60పెరిగిన చికెన్  ధరలు.. కిలో ఎంతంటే?
X

చికెన్‌ ధరలు బాగా పెరిగాయి. వారం రోజుల్లో ఏకంగా కిలోకు రూ.60పెరిగింది. ప్రస్తుతం విత్‌స్కిన్‌ రూ.280, స్కిన్‌లెస్‌ రూ.300 చొప్పున అమ్ముతున్నారు. బోన్‌లెస్‌ చికెన్‌ రూ.400దాకా పలుకుతోంది. ఫారం కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో చికెన్‌ ధర పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. వేసవి కారణంగా పౌల్ట్రీల నిర్వాహకులు కోళ్ల సంఖ్య తగ్గించారు. ఓవైపు వేడిగాలులు తగ్గి, చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో చికెన్‌ వినియోగం పెరిగింది.

ఎన్నికల సమయం కావడంతో హాటళ్లు, రెస్టారెంట్లలో నాన్‌వెజ్‌ అమ్మకాలు పెరిగాయి. డిమాండ్‌ తగ్గట్టుగా కోళ్ల ఉత్పత్తి లేక చికెన్‌ ధరలు పెరుగుతున్నాయి. నెల క్రితం కిలో రూ.200–రూ.220 వరకు ఉన్న చికెన్‌.. పోలింగ్‌ దగ్గర నుంచి క్రమంగా పెరుగుతోంది. కౌంటింగ్‌ తర్వాత కూడా కొద్దిరోజుల వరకు ధరతగ్గే అవకాశం లేదని భావిస్తున్నారు. గుడ్డు రిటైల్‌గా రూ.7 పలుకుతోంది. వచ్చేనెల 10–15 తర్వాత పౌల్ట్రీల నిర్వాహకులు కొత్త బ్యాచ్‌లను తీసుకువచ్చాక చికెన్‌ ధర తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు.

Tags

Next Story