Fastag : మార్చి31 వరకు ఫాస్టాగ్ ఈ కేవైసీ గడువు

Fastag : ఫాస్టాగ్ ఈ కేవైసీ గడువును మరో నెల రోజులు పొడగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేవైసీని పూర్తి చేసేందుకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత సమయం లోపు వాహనదారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది.
కేవైసీ చేయని వారి ఫాస్టాగ్ అకౌంట్స్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్లిపోతాయని, మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలంటే అదనపు టోల్ ట్యాక్స్ చెల్లించాలని స్పష్టం చేసింది. ఫాస్టాగ్ జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై వాహనాల నుంచి టోల్‌టాక్స్ వసూలుకు వినియోగించే ఒక ఎలక్ట్రానిక్ విధానం. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ విధానం తెచ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఫాస్టాఅనేది గ్ కేవైసీ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
KYCని అప్‌డేట్ ఇలా:
* మీ FASTAG KYC స్థితిని తెలుసుకోవడానికి మీరు FASTAG అధికారిక వెబ్‌సైట్ https://fastag.ihmcl.comని సందర్శించాలి.
* మీరు మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా OTPతో లాగిన్ అవ్వాలి.
* ఆ తర్వాత డ్యాష్‌బోర్డ్‌లోకి వెళ్లి My Profile ఆప్షన్‌ను ఎంచుకోండి.
* మీ KYC స్థితి వివరాలు అక్కడ కనిపిస్తాయి.
* KYC పూర్తి కాకపోతే, అభ్యర్థించిన వివరాలను సమర్పించి, ప్రాసెస్ చేయాలి.
* ఇది మీ స్థితిని చూపుతుంది. మీ KYC ప్రక్రియ పూర్తవుతుంది.
* అదేవిధంగా, మీరు ఫాస్ట్‌ట్యాగ్‌ని జారీ చేసిన బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి వివరాలను సమర్పించి, KYCని పూర్తి చేయవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com