Gig Workers Strike : న్యూ ఇయర్ పార్టీకి డెలివరీ కష్టాలు.. గిగ్ వర్కర్ల సమ్మెతో నిలిచిపోనున్న ఆన్‌లైన్ ఆర్డర్లు.

Gig Workers Strike : న్యూ ఇయర్ పార్టీకి డెలివరీ కష్టాలు.. గిగ్ వర్కర్ల సమ్మెతో నిలిచిపోనున్న ఆన్‌లైన్ ఆర్డర్లు.
X

Gig Workers Strike : కొత్త ఏడాది వేడుకల కోసం మీరు గ్రాండ్ ప్లాన్ వేసుకుంటున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. సరిగ్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైమ్‌లో మీకు ఫుడ్ డెలివరీ, గ్రాసరీ యాప్స్ చుక్కలు చూపించబోతున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్) సమ్మెకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 31న అంటే ఈరోజు వారు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా మీరు ఆర్డర్ చేసే బిర్యానీలు, కూల్ డ్రింక్స్ మీ ఇంటికి రావడం కష్టమే. అందుకే పార్టీ ప్లాన్ ఉంటే ఇప్పుడే అన్నీ తెచ్చి పెట్టుకోవడం బెటర్.

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU)తో పాటు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ పిలుపు మేరకు ఈ సమ్మె జరుగుతోంది. కేవలం హైదరాబాద్, ఢిల్లీ మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో సుమారు లక్ష నుంచి 1.5 లక్షల మంది రైడర్లు ఈ నిరసనలో పాల్గొనే అవకాశం ఉంది. తమకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని, పని వేళలు ఎక్కువగా ఉంటున్నాయని, పైగా ఉద్యోగ భద్రత లేదన్న ఆవేదనతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తమ సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయమని వారు భావిస్తున్నారు.

డెలివరీ యాప్స్ సాధారణంగా 10 నిమిషాల్లో సరుకులు పంపిస్తామని ప్రామిస్ చేస్తాయి. కానీ ఈరోజు పరిస్థితి వేరుగా ఉండబోతోంది. సమ్మె కారణంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు యాప్స్ నుంచి లాగ్-ఆఫ్ అవుతారు. అంటే మీరు ఎంత ట్రై చేసినా డెలివరీ పార్ట్నర్ అందుబాటులో లేరు అన్న మెసేజ్ కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో డిన్నర్ ఆర్డర్లు, అర్ధరాత్రి పూట చేసే కేక్ డెలివరీలు భారీగా ఆలస్యం కావచ్చు లేదా పూర్తిగా రద్దు కావచ్చు. ఒక్క ఢిల్లీలోనే 5 వేల మందికి పైగా వర్కర్లు ఆఫ్‌లైన్ అవుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

లాస్ట్ మినిట్‌లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే కస్టమర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. వీలైనంత వరకు మీకు కావాల్సిన కూరగాయలు, నిత్యావసరాలు, పార్టీ సామాగ్రిని మీరే నేరుగా షాపులకు వెళ్లి కొనుక్కోండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలనుకుంటే ఉదయం లేదా మధ్యాహ్నం లోపే పని పూర్తి చేసుకోండి. రాత్రి వేళల్లో డెలివరీ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. డెలివరీ యాప్స్ ఇచ్చే ఆఫర్ల కంటే మీ సొంతంగా ఏర్పాట్లు చేసుకోవడమే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు సేఫ్ ఆప్షన్.

Tags

Next Story