Gold Prices : తులం బంగారం రూ.73,310, కేజీ వెండి రూ.90,000

Gold Prices : తులం బంగారం రూ.73,310, కేజీ వెండి రూ.90,000

బంగారం, వెండి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇవాళ మరోసారి రేట్లు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.1,090 పెరిగి రూ.73,310కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1000 పెరిగి రూ.67,200గా నమోదైంది. వెండి కూడా కేజీకి రూ.1500 పెరిగి రూ.90,000కు చేరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 68 వేల 350గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 73 వేల460గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67వేల 200గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 73 వేల310గా ఉంది.

హైదరాబాద్ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67 వేల 200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 73 వేల 310గా ఉంది. వైజాగ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67 వేల 200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 73 వేల 310గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story