Gold Prices : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే ?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. క్రితం రోజు రూ.700 మేర తగ్గిన బంగారం రేటు ఇవాళ మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఇవాళ రూ.600 మేర పెరిగి రూ. 73 వేల 150 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం రూ. 550 మేర పెరిగి రూ. 67 వేల 50 వద్దకు చేరింది.
బంగారంతో పోటీ పడుతూ వెండి సైతం భారీగా పెరుగుతోంది. వెండి సైతం క్రితం రోజు తగ్గినట్లే తగ్గి ఇవాళ మళ్లీ పెరిగింది. కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ రూ.500 మేర పెరిగి రూ. 86 వేల మార్క్ తాకింది. ఇక ఢిల్లీ మార్కెట్ లోనూ కిలో వెండి రేటు రూ.500 పెరిగి రూ. 86,000 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ నిల్వలను అమ్మేసి ముడిచమురు లాంటి అవసరాలను తీర్చుకున్నాయి. ఇప్పుడు అవి మళ్లీ పసిడిని కొంటుండటంతో ధరలు పెరుగుతున్నాయి.
ఈ ఏడాది 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ అనిశ్చితి భయాలతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
ఈ కారణాల వల్ల 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.లక్షకు చేరొచ్చని నిపుణుల అంచనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com