Gold Price : తగ్గేదేలే.. గోల్డ్ రేట్ దూకుడు.. పరుగో పరుగు

Gold Price : తగ్గేదేలే.. గోల్డ్ రేట్ దూకుడు.. పరుగో పరుగు

పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.73,150కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.67,050గా నమోదైంది. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం 89,500కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,300.

ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,050 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,150.

చెన్నైలో మాత్రం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 710 తగ్గింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,900 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.74,070.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story