Google Invests : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పెట్టుబడులు

Google Invests : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పెట్టుబడులు
X

దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్... ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ లో 350 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 2023లో ఫ్లిప్ కార్డ్ ప్రారంభించబడింది. ఈ కంపెనీలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని గూగుల్ భావిస్తోంది. మొదటి విడతలో భాగంగా గూగుల్ 350 మిలియన్ డాలర్ల పెట్టనుంది.

ఈ పెట్టుబడితో ఫ్లిప్ కార్ట్ లో .. గూగుల్ మైనార్టీ భాగస్వామిగా మారనుంది. ఇప్పటి వరకు గూగుల్ ఎంత పెట్టుబడి పెట్టింది అనే వివరాలను ఫ్లిప్ కార్ట్ అధికారికంగా ప్రకటించలేదు. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఫ్లిప్ కార్ట్ కంపెనీ షేర్లు ఈ పరిణామంతో లాభాల్లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

గూగుల్ పెట్టుబడితో ఫ్లిప్ కార్ట్ 5-10 శాతం ప్రీమియం విలువను పొందనుందని భావిస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం... ఫ్లిప్ కార్ట్ విలువ ఇప్పుడు 36 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags

Next Story